Mohan Babu: చిరంజీవితో కలిసి నటించిన సినిమాపై మోహన్ బాబు స్పందన
- 'పట్నం వచ్చిన పతివ్రతలు' తాను మర్చిపోలేని సినిమాల్లో ఒకటన్న మోహన్ బాబు
- సినిమాలో తన పాత్ర ఎంతో తృప్తిని కలిగించిందని వ్యాఖ్య
- చిరంజీవితో కలిసి నటించడం ప్రత్యేక అనుభూతిని మిగిల్చిందన్న మోహన్ బాబు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తాను నటించిన చిత్రాల్లో తనకు బాగా చేరువైన సినిమాల గురించి గత కొన్ని రోజులుగా ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన మనసుకు బాగా నచ్చిన మరో చిత్రంపై ఈరోజు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తన సినీ ప్రయాణంలో 1982లో వచ్చిన 'పట్నం వచ్చిన పతివ్రతలు' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుందని మోహన్ బాబు పేర్కొన్నారు. ఎంతో ప్రతిభావంతుడైన మౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో తృప్తిని కలిగించిందని అన్నారు. ముఖ్యంగా తన ప్రియ మిత్రుడు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం, ఆయనకు సోదరుడిగా నటించడం ప్రత్యేక అనుభూతిని మిగిల్చిందని చెప్పారు. తాను మర్చిపోలేని చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచి పోతుందని తెలిపారు.
ఈ సినిమాలో రాధిక, గీత హీరోయిన్లుగా నటించారు.