Chautala: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా ఇకలేరు

Om Prakash Chautala Dies At 89

  • కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూసిన చౌతాలా
  • ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత
  • హర్యానాకు ఐదుసార్లు సీఎంగా సేవలందించిన లీడర్

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత (ఐఎన్ఎల్ డీ) చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో చౌతాలా చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి. చౌతాలా వయసు 89 ఏళ్లు.. హర్యానా రాజకీయాల్లో చౌతాలా తనదైన ముద్రవేశారు. 1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా చౌతాలా సేవలందించారు. వృద్ధాప్యం కారణంగా చౌతాలా కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడంలేదు.

Chautala
INLD
Om prakash Chautala
Haryana
Former CM
  • Loading...

More Telugu News