KTR: హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
- ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదు
- కేటీఆర్ ను ఏ1గా చేర్చిన ఏసీబీ అధికారులు
- కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.
కాగా, ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ఏసీబీ గురువారం కేసు నమోదు చేసింది.