Hyderabad: లేటెస్ట్ ట్రెండ్. . కాలింగ్ బెల్ కొట్టి చైన్ స్నాచింగ్.. వీడియో ఇదిగో

Thief Snatches Chain After Ringing Doorbell In Hyderabad

  • నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ సన్ సిటీలో ఘ‌ట‌న‌
  • ముఖానికి మాస్కుతో పట్టపగలే అపార్ట్‌మెంట్ లోకి దర్జాగా వెళ్లిన దొంగ‌
  • ఓ ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టిన వైనం
  • మహిళ డోర్ తెరవగానే ఆమె మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును తీసుకుని పరార్‌

ఇంత‌కుముందు రోడ్ల‌పై, ఇంటిముందు ఉన్న మ‌హిళ‌ల నుంచి దొంగ‌లు చైన్ స్నాచింగ్ చేయ‌డం చూశాం. కానీ, ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో వీటికి భిన్నంగా ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ దొంగ నేరుగా ఓ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్‌ కొట్టి మ‌రీ చైన్ స్నాచింగ్‌కు పాల్ప‌డ్డాడు. ఈ షాకింగ్‌ ఘ‌ట‌న నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ సన్ సిటీలో జ‌రిగింది. 

ముఖానికి మాస్క్ వేసుకుని పట్టపగలే అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి దర్జాగా వెళ్లిన దొంగ‌ ఓ ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు. మహిళ డోర్ తెరవగానే ఆమెతో మాటలు కలిపి ఆమె మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును తెంపుకుని పరారయ్యాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన మహిళ వెంటనే స్థానికులను అప్రమత్తం చేస్తూ.. కేకలు వేస్తూ దొంగ వెంట పరుగెత్తింది. అయినా ఫలితం లేకపోయింది. 

ఈ చైన్ స్నాచింగ్ ఘ‌ట‌నకు సంబంధించిన‌ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో పట్టపగలే దొంగలు ఇలా ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడుతుంటే మాకిక భద్రత ఎలా ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News