Road Accident: ఆఫ్ఘనిస్థాన్‌లో ఒకే హైవేపై రెండు ప్రమాదాలు.. 52 మంది దుర్మరణం

52 Killed In Separate Road Accidents In Afghanistan

  • ప్యాసింజర్ బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో పదుల సంఖ్యలో మృతులు
  • గాయపడిన 76 మందిలో మరికొందరి పరిస్థితి విషమం
  • ప్రమాదాలకు కారణమవుతున్న అధ్వాన రోడ్లు

ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 52 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్-కాందహార్ హైవేపై గత రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

ఇదే హైవేపై మరో ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తంగా 52 మంది మృతి చెందారు. గాయపడిన 76 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్న కారణంగా అక్కడ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Road Accident
Afghanistan
Kabul-Kandahar Highway
  • Loading...

More Telugu News