Revanth Reddy: గంట ముందే అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేవంత్ భేటీ
- భూ భారతి, రైతు భరోసా అంశాలపై మార్గనిర్దేశం చేసిన సీఎం
- ఈరోజు మూడు బిల్లులను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. తొలి గంటలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం భూ భారతి 2024 బిల్లుపై చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత బిల్లుకు ఆమోదముద్ర పడుతుంది.
ఈరోజు మరో మూడు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెంగాణాణ మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును రేవంత్ సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. ఈ రెండు అంశాలపై సభలో లఘు చర్చ జరుగుతుంది.
గంట ముందే అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి భూ భారతి, రైతు భరోసా తదితర అంశాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో చర్చలు జరపనున్నారు. తమ పార్టీ సభ్యులకు మార్గనిర్దేశం చేయనున్నారు.