Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది: మంత్రి ఆనం

Anam fires on YSRCP

  • సాగునీటి సంఘాల ఎన్నికలపై వైసీపీ నేతల విమర్శలు
  • వైసీపీ నేతల ఆరోపణలు అర్థరహితమన్న ఆనం
  • సాగునీటి సంఘాల ఎన్నికలు జరిపే ధైర్యం వైసీపీకి లేకపోయిందని విమర్శ

సాగునీటి సంఘాల ఎన్నికలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. 

గత ప్రభుత్వానికి సాగునీటి సంఘాల ఎన్నికలు జరిపే ధైర్యం లేకపోయిందని చెప్పారు. సోమశిల ప్రాజెక్టు దెబ్బతినడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. సరైన నిర్వహణ లేకే ప్రాజెక్టు తెగిపోయిందని దుయ్యబట్టారు.

Anam Ramanarayana Reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News