Mura: అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పై మలయాళ సూపర్ హిట్!

Mura Movie Update

  • మలయాళంలో నిర్మితమైన 'ముర'
  • నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథ 
  • థియేటర్లలో 50 రోజులు ఆడిన సినిమా 
  • ఈ నెల 25 నుంచి మొదలయ్యే స్ట్రీమింగ్


ఈ ఏడాది మలయాళ సినిమా ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమాలు సైతం భారీ వసూళ్లను నమోదు చేశాయి. అలాంటి సినిమాల జాబితాలో 'ముర' కూడా కనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి మహ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించాడు. నవంబర్ 8వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడి థియేటర్లలో సందడి చేసింది.
 
కేరళలోని తిరువనంతపురం నేపథ్యంలో నడిచే కథ ఇది. సూరజ్ వెంజరమూడు .. మాలా పార్వతి .. కన్నన్ నాయర్ వంటి వారు ముఖ్యమైన పాత్రలను పోషించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 

నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది. జీవితం పట్ల అంతగా బాధ్యత లేని ఆ స్నేహితులు నిరుద్యోగులుగా ఉంటారు. అందువలన తమకి లభించిన ఒక పనిని చేయడానికి వాళ్లు అంగీకరిస్తారు .. అది ఒక దోపిడి. ఆ దోపిడి అనంతరం వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? అప్పుడు వాళ్లు ఏం చేశారు? అనేదే కథ. థియేటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 


  • Loading...

More Telugu News