Ravichandran Ashwin: 'భార‌త క్రికెట‌ర్‌గా ఇదే నా చివ‌రి రోజు'.. రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తూ అశ్విన్ భావోద్వేగం!

Ravichandran Ashwin announces his retirement from all forms of international cricket

  • అంత‌ర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ గుడ్ బై
  • కెప్టెన్ రోహిత్ తో క‌లిసి మీడియాతో మాట్లాడిన స్టార్ స్పిన్న‌ర్ 
  • ఇది త‌న‌కు చాలా ఎమోష‌న‌ల్ డే అంటూ అశ్విన్ ఫెర్వేల్ స్పీచ్
  • అశ్విన్ రిటైర్మెంట్‌పై కోహ్లీ ఎమోష‌న‌ల్ ట్వీట్‌    

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ మీడియా స‌మావేశంలో కాస్త భావోద్వేగానికి గుర‌య్యాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి మీడియాతో మాట్లాడిన ఈ స్టార్ స్పిన్న‌ర్ భార‌త క్రికెట‌ర్‌గా ఇదే నా చివ‌రి రోజు అంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. 

"భార‌త క్రికెట‌ర్‌గా ఇదే నా చివ‌రి రోజు. దేశ‌వాళీ క్రికెట్ ఆడొచ్చు. కానీ అంత‌ర్జాతీయ కెరీర్ ఇంత‌టితో ముగిసింది. రోహిత్‌తో పాటు జ‌ట్టు స‌భ్యుల‌తో డ్రెస్సింగ్ రూమ్, మైదానంలో నాకు ఎన్నో జ్ఞాప‌కాలు ఉన్నాయి. కెరీర్‌లో నాకు అండ‌గా నిలిచిన బీసీసీఐ, కోచ్‌లు, ఇత‌ర ఆట‌గాళ్ల‌కు ధ‌న్య‌వాదాలు. నాతో క‌లిసి ఆడిన రోహిత్‌, విరాట్‌, అజింక్య ర‌హానే, ఛ‌టేశ్వ‌ర్ పూజారా తదిత‌ర ప్లేయ‌ర్ల‌కు థ్యాంక్యూ. ఆస్ట్రేలియాలో ఆడ‌టాన్ని ఎంతో ఆస్వాదించా. ఇది నాకు చాలా ఎమోష‌న‌ల్ డే" అని అశ్విన్ ఫెర్వేల్ స్పీచ్ ఇచ్చాడు. 

అశ్విన్ రిటైర్మెంట్‌పై కోహ్లీ ఎమోష‌న‌ల్ ట్వీట్‌
"14 ఏళ్లుగా నీతో క‌లిసి ఆడుతున్నా. రిటైర్ అవుతున్న‌ట్లు నాతో చెప్ప‌డంతో భావోద్వేగానికి లోన‌య్యా. నీతో ఆడిన రోజుల‌న్నీ ఒక్క‌సారిగా గుర్తొచ్చాయి. నీతో ఆడిన ప్ర‌తిసారి నేను గేమ్‌ను ఆస్వాదించా. భార‌త క్రికెట్‌కు నైపుణ్యంతో కూడిన మ్యాచ్ విన్నింగ్ స‌హ‌కారం మ‌రువ‌లేనిది. నువ్వు ఎప్ప‌టికీ భార‌త క్రికెట్ లెజెండ్‌గా గుర్తుండిపోతావు. ధ‌న్య‌వాదాలు మిత్ర‌మా" అని కోహ్లీ ట్వీట్ చేశారు.  

  • Loading...

More Telugu News