America: అమెరికాలో పనిచేయాలని కలలు కనే భారతీయ ప్రొఫెషనల్స్‌కు శుభవార్త!

Joe Biden Govt Good News For Indians

  • విదేశీ నిపుణులను సులభంగా నియమించుకునే వెసులుబాటు
  • ఎఫ్-1 స్టూడెంట్ వీసాను హెచ్-1బీ వీసాగా మార్చుకునే అవకాశం
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల్లో పలు మార్పులు 
  • వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అమల్లోకి

అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశీ నిపుణులను మరింత సులభంగా నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. అలాగే, ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షలాదిమంది భారతీయ ప్రొఫెషనల్స్‌కు ప్రయోజనం చేకూరనుంది.

అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా (నాన్ ఇమిగ్రెంట్) సాయంతో విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసా ద్వారా భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల్లో మార్పులు చేసి అవసరాలకు తగ్గట్టుగా విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పించింది. 

ఈ కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లికేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునే అవకాశం యజమానులకు లభిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెంజాడ్రో ఎన్ మేయోర్కాస్ తెలిపారు.

America
USA
HIB Visa
F1 Visa
Indians
Joe Biden
  • Loading...

More Telugu News