Rammohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు బర్త్ డే విషెస్ తెలిపిన మోదీ, చంద్రబాబు
--
కేంద్ర మంత్రి, టీడీపీ నేత కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. యువతలో అత్యంత పాప్యులారిటీ ఉన్న నాయకుడని కొనియాడారు. దేశ వైమానిక రంగాన్ని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు పాటుపడుతున్నారని అభినందించారు.
రామ్మోహన్ నాయుడుకు బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఏపీ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.