Sunita Williams: క్రూ-10 ప్రయోగం ఆలస్యం.. మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత

Sunita Williams and Butch Wilmore return to Earth delayed again

  • వారం రోజుల ప్రయోగాల కోసం జూన్‌లో 6న అంతరిక్ష కేంద్రానికి సునీత, విల్‌మోర్
  • వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వ్యోమగాములు
  • వారిని తిరిగి తీసుకొచ్చేందుకు క్రూ-9 ప్రయోగం
  • ఫ్రిబవరిలో జరగాల్సిన క్రూ-10 ప్రయోగం మార్చికి వాయిదా

వారం రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లి సాంకేతిక కారణాలతో అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆమె ఐఎస్ఎస్‌లోనే గడపక తప్పేలా కనిపించడం లేదు.

ఎనిమిది రోజుల ప్రయోగాల కోసం బచ్ విల్‌మోర్‌తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్యుల్‌లో ఈ ఏడాది జూన్ 6న సునీత ఐఎస్ఎస్‌కు వెళ్లారు. 14వ తేదీనే వీరు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీ కారణంగా వారిని అక్కడే వదిలేసి వ్యోమనౌక ఒంటరిగా తిరిగి వచ్చింది. దీంతో అప్పటి నుంచి వారు అక్కడే చిక్కుకుపోయారు. 

వారిని తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు ఇటీవల స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్‌ను నాసా ప్రయోగించింది. ఇందులో నాలుగు సీట్లు ఉండగా హాగ్, గోర్బునోవ్ అనే వ్యోమగాములను పంపించి మిగతా రెండు సీట్లను సునీత, విల్‌మోర్‌ కోసం ఖాళీగా వదిలిపెట్టారు. సెప్టెంబరులో ఐఎస్ఎస్‌తో అనుసంధానమైన ఈ మిషన్ ఫిబ్రవరిలో తిరిగి రావాల్సి ఉంది. అయితే, క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి అప్పటి వరకు సునీత, విల్‌మోర్ ఇద్దరికీ నిరీక్షణ తప్పనట్టే.

  • Loading...

More Telugu News