: ఏపీపీఎస్సీ అక్రమాలపై పట్టువిడవని టీడీపీ
ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై తెలుగుదేశం పార్టీ పట్టువిడకుండా పోరాడుతోంది. నిన్న సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సీఎం కిరణ్ ను ప్రభావితం చేసిన టీడీపీ నేతలు ఈ మధ్యాహ్నం గవర్నర్ ను కలవనున్నారు. అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసి ఏపీపీఎస్సీ సభ్యుల అవినీతిపై ఫిర్యాదు చేయనున్నారు. కాగా, క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ నేతల బైఠాయింపుతో స్పందించిన సీఎం ఏపీపీఎస్సీ తీరుపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.