Jagan: బెంగళూరు నుంచి నేడు కర్నూలుకు వస్తున్న జగన్

Jagan coming to Kurnool

  • ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలుకు వస్తున్న జగన్
  • వైసీపీ నేత సురేందర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ లో పాల్గొననున్న మాజీ సీఎం
  • అనంతరం తాడేపల్లికి బయలుదేరనున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. 

జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరుతారు. 11.55 గంటలకు కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్స్ హెలిపాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బళ్లారి చౌరస్తా మీదుగా కర్నూలు నగర శివారులో ఉన్న జీఆర్సీ కన్వెన్షన్ కు చేరుకుంటారు. వివాహ రిసెప్షన్ లో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 

అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఏపీఎస్పీ గ్రౌండ్స్ కు చేరుకుని... హెలికాప్టర్ లో తాడేపల్లికి బయలుదేరుతారు. తాడేపల్లిలో పలువురు వైసీపీ నేతలతో ఆయన సమావేశమవుతారని సమాచారం. మరోవైపు, కర్నూలులోని ఎపీఎస్పీ గ్రౌండ్స్ లో ఉన్న హెలిపాడ్ ను వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పరిశీలించారు. ప్రత్యేక బందోబస్తు కోసం స్థానిక పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారు. 

  • Loading...

More Telugu News