Malladi Vishnu: వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేశారు: చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫైర్

Chandrababu stopped volunteers says Malladi Vishnu

  • వైసీపీ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందన్న మల్లాది విష్ణు
  • చంద్రబాబు 3 లక్షల మంది పెన్షన్లను తొలగించారని మండిపాటు
  • పెన్షన్ల తొలగింపును వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్య

వైసీపీ హయాంలో పెన్షన్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా జరిగిందని... వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లను అందించారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వికలాంగులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు జగన్ ప్రభుత్వం అండగా నిలబడిందని చెప్పారు.  

వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు మనుగడలో లేకుండా చేశారని... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్లను పక్కకు తప్పించారని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు 3 లక్షల మంది పెన్షన్లను తొలగించారని మండిపడ్డారు. 2 లక్షల మంది కొత్తగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారని... వారికి ఇవ్వకపోగా 3 లక్షల మంది పెన్షన్లను తీసేశారని విమర్శించారు. పెన్షన్లను తొలగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జగన్ హయాంలో 66 లక్షల మందికి పైగా పెన్షన్లను ఇచ్చారని చెప్పారు.

  • Loading...

More Telugu News