Sandhya Theatre: మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు?: తొక్కిసలాట ఘటనపై సంధ్య థియేటర్‌కు నోటీసులు

Police issues show cause notices to Sandhya Theatre

  • పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసుల నోటీసులు
  • పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట... మహిళ మృతి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతురాలి తనయుడు

తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయిందని, లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు.

ఈ నెల 4వ తేదీన రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. తాజాగా, సంధ్య థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News