Scooter Bomb: స్కూటర్ బాంబు పేలి రష్యా న్యూక్రియర్ డిఫెన్స్ చీఫ్ కిరిలోవ్ మృతి
- మాస్కోలో పేలుడు కలకలం
- ఓ అపార్ట్ మెంట్ ముందు పేలిన స్కూటర్
- జనరల్ ఇగోర్ కిరిలోవ్, ఆయన సహాయకుడు మృతి
- ఉక్రెయిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రష్యా
రష్యా రాజధాని మాస్కోలో స్కూటర్ బాంబు పేలింది. ఈ ఘటనలో రష్యా న్యూక్లియర్, కెమికల్ అండ్ బయోలాజికల్ డిఫెన్స్ చీఫ్ జనరల్ ఇగోర్ కిరిలోవ్ మృతి చెందడం సంచలనం సృష్టించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక నివాసానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ పేలుడు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
రైజాన్ స్కీ ప్రాస్పెక్ట్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ వెలుపల ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిరిలోవ్ సహాయకుడు కూడా మృతి చెందాడు. ఈ స్కూటర్ బాంబు పేలుడు వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చని రష్యా నాయకత్వం అనుమానాలు వ్యక్తం చేసింది.