Stock Market: భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses

  • 1,064 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 332 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.83 శాతం నష్టపోయిన భారతి ఎయిల్ టెల్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడుతున్న నేపథ్యంలో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ బలహీన సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,064 పాయింట్లు నష్టపోయి 80,684కి పడిపోయింది. నిఫ్టీ 332 పాయింట్లు కోల్పోయి 24,336 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో భారతి ఎయిర్ టెల్ (-2.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.46%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.40%), టీసీఎస్ (-2.07%), ఏషియన్ పెయింట్స్ (-1.94%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News