Alla Nani: రేపు టీడీపీలో చేరనున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

Alla Nani joining TDP tomorrow

  • రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్న ఆళ్ల నాని
  • ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన ఎమ్మెల్యే బడేటి చంటి
  • వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్య

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఆళ్ల నాని టీడీపీలోకి రావడం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదని... ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. కానీ, హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. వైసీపీ కుటుంబానికి సన్నిహితులు, జగన్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని బడేటి చంటి అన్నారు. 

రెండు నెలల క్రితం వైసీపీకి, పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. పార్టీ పరంగా టీడీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని... ఆళ్ల నాని స్వచ్ఛందంగానే టీడీపీలో చేరుతున్నారని సమాచారం.

Alla Nani
Telugudesam
  • Loading...

More Telugu News