Sobhita Dhulipala: నాగచైతన్య నా కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవాడు: శోభిత

Sobhita interview

  • 2022లో చైతూతో స్నేహం మొదలయిందన్న శోభిత
  • తొలిసారి ముంబైలో ఓ కేఫ్ లో కలుసుకున్నామని వెల్లడి
  • తెలుగులో మాట్లాడాలని చైతూ అడిగేవాడన్న శోభిత

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం ఇటీవల వైభవంగా జరిగింది. తాజాగా ఈ కొత్త జంట ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

తాను తొలిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లానని శోభిత తెలిపారు. 2022లో నాగచైతన్యతో స్నేహం మొదలయిందని చెప్పారు. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని... తాము ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించి అభిప్రాయాలను పంచుకునేవాళ్లమని తెలిపారు. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య తనను తరచూ అడిగేవారని... తెలుగులో మాట్లాడటం వల్ల తమ బంధం మరింత బలపడిందని చెప్పారు. 

తాము తొలిసారి ముంబైలోని ఓ కేఫ్ లో కలుసుకున్నామని శోభిత తెలిపారు. అప్పుడు తాను ముంబైలో, నాగచైతన్య హైదరాబాద్ లో ఉండేవాళ్లమని... తన కోసం చైతూ హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవాడని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ... తెలుగులో మాట్లాడాలని శోభితను ఎప్పుడూ అడిగేవాడినని తెలిపారు. ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తుంటామని... వారిలో తెలుగులో మాట్లాడేవారిని చూస్తే తనకు ముచ్చటగా ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News