Steve Smith: మొదట సులువైన క్యాచ్ వదిలేసి.. ఆ తర్వాత స్టన్నింగ్ క్యాచ్‌తో షాకిచ్చిన స్టీవ్ స్మిత్!
- బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆసీస్ మూడో టెస్టు
- స్టన్నింగ్ క్యాచ్‌తో కేఎల్ రాహుల్‌కి షాకిచ్చిన స్టీవ్ స్మిత్
- ఆసీస్ కంటే 265 పరుగుల వెనుకంజలో టీమిండియా
- మరోసారి వరుణుడి ఆటంకంతో ఆగిన మ్యాచ్
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఫీల్డర్ స్టీవ్ స్మిత్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్.. కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా డైవ్ చేస్తూ అందుకోవడం విశేషం. నాలుగో రోజు ఆట ప్రారంభమైన వెంటనే కమ్మిన్స్ వేసిన తొలి బంతికే స్మిత్‌కు కేఎల్ రాహుల్ సులువైన క్యాచ్ ఇచ్చాడు.
అయితే, సెకండ్ స్లిప్‌లో ఉన్న స్మిత్.. ఆ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కావడంతో.. అప్రమత్తంగా లేని స్మిత్ ఫీల్డింగ్ కారణంగా రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అయితే, ఆ తర్వాత స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఆడిన బంతి అతని బ్యాట్‌కు తగిలి స్లిప్స్‌లో ఉన్న స్మిత్‌కు కొంచెం దూరంగా వెళ్లింది. కానీ స్మిత్.. ఆ బంతిని తన కుడి వైపు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో 84 పరుగుల రాహుల్ ఇన్నింగ్స్‌కు తెరపడి పెవిలియన్ చేరాడు.
ఇక గబ్బా టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. 180 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (52), నితీశ్ కుమార్ రెడ్డి (09) క్రీజ్‌లో ఉన్నారు. మరోసారి వరుణుడు ఆటంకం కలిగించడంతో రెండో సెషన్‌లోనే మ్యాచ్ ఆగిపోయింది. ఆసీస్ కంటే భారత్ ఇంకా 265 పరుగులు వెనుకబడి ఉంది. అలాగే ఫాలోఆన్ నుంచి బయటపడాలంటే టీమిండియా ఇంకా 66 పరుగులు చేయాల్సి ఉంది.