Tirumala: ఈ నెల 18 నుంచి మార్చి నెల కోటా టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

TTD set to issue March quota tickets

  • డిసెంబరు 18 నుంచి వివిధ సేవలు, దర్శనాల టికెట్ల జారీ
  • ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
  • అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా భక్తులు టికెట్లు పొందాలని వెల్లడి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మార్చి నెలకు సంబంధించి వివిధ ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లను ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు విడుదల చేయనుంది. 

శ్రీవారి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల టికెట్లను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించి లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 

ఇక, శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు  విడుదల చేయనున్నారు. అదే రోజున (డిసెంబరు 21) వర్చువల్ సేవా టికెట్లను కూడా విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, ఆయా సేవల ద్వారా లభించే దర్శన స్లాట్ల టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. 

డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. అదే రోజు (డిసెంబరు 23) ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అంతేకాదు, డిసెంబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం టికెట్లను విడుదల చేయనున్నారు.

డిసెంబరు 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు (డిసెంబరు 24) మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. 

https://ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు పొందవచ్చని టీటీడీ వెల్లడించింది.

Tirumala
March Quota
Tickets
TTD
  • Loading...

More Telugu News