BRS: లగచర్ల రైతుకు బేడీల అంశంపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్... మండలి రేపటికి వాయిదా

Telangana Assembly adjourned tomorrow

  • మండలిలో జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు
  • నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించిన బీఆర్ఎస్
  • మండలి వాయిదా తర్వాత చైర్మన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా

వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుకు బేడీలు వేసిన అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు శాసనమండలిలో డిమాండ్ చేశారు. జై జవాన్... జై కిసాన్ అంటూ నినాదాలు చేయడంతో పాటు ఆ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ శాసనమండలిని రేపటికి వాయిదా వేశారు.

శాసనమండలిలో పర్యాటక విధానంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. కాసేపటికే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. లగచర్ల అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. బీఏసీలో కూడా ఈ అంశంపై చర్చ కోసం డిమాండ్ చేసినట్లు చెప్పారు.

లగచర్ల అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని చైర్మన్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు మాత్రం లగచర్ల ఘటనపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

BRS
Telangana
Telangana Assembly Session
Congress
  • Loading...

More Telugu News