Suman: అల్లు అర్జున్ అరెస్ట్ పై నటుడు సుమన్ స్పందన

Suman responce on Allu Arjun arrest

  • తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న సుమన్
  • ఇందులో అల్లు అర్జున్ ప్రమేయం లేదని వ్యాఖ్య
  • థియేటర్ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలన్న సుమన్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు బన్నీకి బెయిల్ ఇచ్చినప్పటికీ... సాంకేతిక కారణాల వల్ల ఆయన ఒక రాత్రి చంచల్ గూడ జైల్లో గడపాల్సి వచ్చింది. జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత పలువురు సినీ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. బన్నీ అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. జాతీయ మీడియా కూడా ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది.

మరోవైపు బన్నీ అరెస్ట్ పై తాజాగా సీనియర్ సినీ నటుడు సుమన్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేదని ఆయన అన్నారు. బన్నీని అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు. ఆ ఘటనకు థియేటర్ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని అన్నారు. 

ఒక స్టార్ హీరో థియేటర్ కు వస్తున్నప్పుడు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యానిదే అని సుమన్ చెప్పారు. థియేటర్ వద్ద ఎంత మంది జనం ఉన్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది యాజమాన్యమే చూసుకోవాలని అన్నారు. తాను హీరోగా ఉన్నప్పుడు థియేటర్ యజమానులు తనను ఆహ్వానించేవారని... తాను వెళ్లినప్పుడు తగిన ఏర్పాట్లు చేసేవారిని చెప్పారు. యాక్టర్లు థియేటర్లకు వెళ్లొచ్చని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Suman
Allu Arjun
Tollywood
  • Loading...

More Telugu News