Amit Shah: దేశంలో నక్సలైట్ల శకం ముగిసింది: అమిత్ షా

Union minister Amit Shah says its endgame for Naxals

  • జగదల్‌పూర్‌లో మాజీ నక్సల్స్‌తో అమిత్ షా సమావేశం
  • 31 మార్చి 2026 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తరిమేస్తామన్న కేంద్రహోం మంత్రి
  • ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు హతమార్చాయన్న షా
  • నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిసిపోయి అభివృద్ధికి సహకరించాలని సూచన

దేశంలో నక్సలిజం చివరి అంకంలో ఉందని, మార్చి 2026 నాటికి దానిని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌తో చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అమిత్ షా నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని నొక్కి వక్కాణించారు. 

గత ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్‌ను భద్రతా దళాలు హతమార్చాయని, 1000 మందిని అరెస్ట్ చేయగా, 837 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. నక్సలిజంపై మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారి పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య 100 లోపునకు పడిపోయిందని వివరించారు.

‘నక్సల్ రహిత.. డ్రగ్ రహిత ఇండియా’ కలను సాకారం చేయడంలో చత్తీస్‌గఢ్ పోలీసుల కృషిపై హోంమంత్రి ప్రశ్నంసలు కురిపించారు. వారి సహకారాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలని కొనియాడారు. మిగిలిన నక్సలైట్లు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీరు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు. 

Amit Shah
Naxals
Maoists
Chhattisgarh
  • Loading...

More Telugu News