Gukesh: వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ గుకేశ్ త‌న ప్రైజ్‌మ‌నీలో ఎంత ప‌న్ను చెల్లించాలో తెలిస్తే షాక‌వ్వ‌డం ఖాయం!

D Gukesh To Pay RS 47 000 000 Income Tax Following World Chess Championship Win

  • 18 ఏళ్ల‌కే వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచిన గుకేశ్‌
  • చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం
  • విజేత గుకేశ్‌కు రూ. 11.34 కోట్ల న‌గ‌దు పురస్కారం
  • అత‌ను క‌ట్టాల్సిన ప‌న్ను రూ. 4.67కోట్లు

భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవ‌త‌రించాడు. 18 ఏళ్లకే ఇలా వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచాడు. త‌ద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన (18ఏళ్ల 8నెలల 14రోజులు) ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 

అయితే, వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచిన గుకేశ్‌కు మొత్తం రూ. 11.34 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. ఫీడే రూల్ ప్ర‌కారం మొత్తం ఛాంపియ‌న్‌షిప్ ప్రైజ్ మ‌నీ మొత్తం రూ. 20.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆట‌గాడికి రూ. 1.69 కోట్లు ఇస్తారు. దీని ప్ర‌కారం 3 గేమ్‌లు గెలిచిన‌ గుకేశ్‌కు రూ. 5.04 కోట్లు లభించాయి. రెండు గేమ్లు గెలిచిన డింగ్‌కి రూ. 3.36 కోట్లు ద‌క్కాయి. మిగిలిన దాన్ని స‌మానంగా పంచారు. దాంతో గుకేశ్‌కు మొత్తం రూ. 11.34 కోట్ల న‌గ‌దు పుర‌స్కారం ద‌క్కింది.

గుకేశ్ క‌ట్టాల్సిన ప‌న్ను రూ. 4.67కోట్లు!
ఇక వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచిన గుకేశ్ భారీ మొత్తంలో ప‌న్ను చెల్లించాల్సి ఉంది. ప్రైజ్ మ‌నీ కింద అత‌నికి ద‌క్కిన రూ. 11.34 కోట్ల‌పై రూ. 3కోట్ల వ‌ర‌కు ఆయ‌న ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంద‌ని అంచ‌నా. ఇత‌ర స‌ర్‌ఛార్జీల‌తో క‌లిపి మొత్తంగా రూ. 4.67 కోట్ల వ‌ర‌కు ట్యాక్స్ క‌ట్టాల్సి ఉంటుంద‌ని నిపుణులు లెక్క‌గ‌డుతున్నారు. దీనికి కార‌ణం గుకేశ్ నిక‌ర ఆస్తి రూ. 21 కోట్ల‌కు పెర‌గ‌డ‌మే. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం 30 శాతం పన్ను స్లాబ్ కింద లెక్క‌లేస్తున్నారు. 

కాగా, ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించిన గుకేశ్‌పై ఇంత భారీ పన్నులు వేయడం ప‌ట్ల‌ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. "ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నందుకు, రూ. 11 కోట్ల ప్రైజ్ మనీలో రూ. 5 కోట్లు సంపాదించినందుకు భారత పన్ను శాఖకు అభినందనలు" అని ఒక‌రు కామెంట్ చేశారు. "భారతీయ పన్ను శాఖ ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుకే ఉంటుంది. వారు తమ విజయాల్లో తమ వాటాను పొందేలా చూసుకుంటారు! చెస్‌లో కూడా వారు సంపాదనకు చెక్‌మేట్ పెట్టి రూ. 11 కోట్లలో రూ. 5 కోట్లు రాబట్టింది" అని మ‌రో నెటిజ‌న్ ట్వీట్ చేశారు.  

  • Loading...

More Telugu News