PV Sindhu: పవన్ కల్యాణ్ కు పెళ్లి కార్డు అందించిన పీవీ సింధు
- త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పీవీ సింధు
- వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో ఈ నెల 22న వివాహం
- నేడు మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయానికి తండ్రితో కలిసి విచ్చేసిన సింధు
ఇండియన్ బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు మరి కొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో పీవీ సింధు వివాహం డిసెంబరు 22న రాజస్థాన్ లో జరగనుంది. కొన్నిరోజుల కిందటే సింధు, వెంకట దత్తసాయి నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో, తన పెళ్లికి రావాలంటూ సింధు ప్రముఖులను స్వయంగా కలుస్తూ ఆహ్వానిస్తోంది.
నేడు, పీవీ సింధు, ఆమె తండ్రి వెంకటరమణ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. సింధు... పవన్ కల్యాణ్ కు పెళ్లి పత్రిక అందించి తన పెళ్లికి రావాలంటూ ఆహ్వానించింది. ఈ సందర్భంగా సింధుకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్... సింధు, ఆమె తండ్రి వెంకటరమణతో కాసేపు ముచ్చటించారు.