Upasana Kamineni Konidela: అదే నిజమైన సనాతన ధర్మమని తాతయ్య చెప్పారు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
- అయోధ్యలో అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభం
- తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్ లోనూ ప్రారంభించామన్న ఉపాసన
- గౌరవ మర్యాదలతో వైద్యం అందిచడమే సనాతన ధర్మమని వ్యాఖ్యలు
- తాతయ్య నుంచి ఈ విషయం నేర్చుకున్నామన్న ఉపాసన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి, అపోలో ఫౌండేషన్ (సామాజిక సేవల విభాగం) వైస్ చైర్ పర్సన్ ఉపాసన సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోగులకు పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ వారికి వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని, ఇది తమకు తమ తాతయ్య చెప్పిన అంశమని ఉపాసన వెల్లడించారు.
"రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి... వారి పట్ల గౌరవం చూపుతూ వైద్యం అందించాలి అని మా తాతయ్య నేర్పించారు... ఆయన మాటలే మాకు స్ఫూర్తి. తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్ లో అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. తాజాగా అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను అయోధ్య రామ మందిరం వద్ద కూడా ఏర్పాటు చేశాం. ఈ అత్యవసర ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాం. మాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు" అంటూ ఉపాసన సోషల్ మీడియాలో స్పందించారు.