Viral Video: పెంచిన ప్రేమ వదలడం లేదు.. వైరల్ వీడియో ఇదిగో!
- తనను పెంచిన జంతు సంరక్షకుడిని వెళ్లనీయకుండా అడ్డుకున్న గున్న ఏనుగు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- ఒక్క రోజులోనే 9 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు
అతనో జంతు సంరక్షకుడు. ఒక ఏనుగు పిల్లను చిన్నప్పటి నుంచీ పెంచుతున్నాడు. ఓ రోజు తాను బయటికి వెళ్లాల్సి వచ్చింది. అతడిని బైక్ పై తీసుకుని వెళ్లడానికి ఓ వ్యక్తి వచ్చాడు. కానీ తనను పెంచిన వ్యక్తిని పోనివ్వకుండా.. ఆ గున్న ఏనుగు మారాం చేసింది. అంతా ఇంతా కాదు.. అతడిని గట్టిగా పట్టుకుని ఉండిపోయింది. తాను విడిపించుకుని బైక్ ఎక్కబోతుంటే అడ్డుపడి ఆపింది. చివరికి ఆ బైక్‌పై వచ్చిన వ్యక్తి బైక్ ను ఈ జంతు సంరక్షకుడికి ఇచ్చి.. తాను కిందికి దిగాడు. ఏనుగును దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడు. కానీ గున్న ఏనుగు దాన్ని గుర్తించింది. బైక్ వెంట పడి మరీ ఆపేసింది. తన తొండంతో అతడిని పట్టుకుని బైక్ నుంచి దింపేసి తన వెంట తీసుకుపోయింది.
- సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. పోస్టు చేసిన ఒక్క రోజులోనే 9 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ లైకులు, షేర్లు నమోదవుతున్నాయి.
- ఏమైనా ఏనుగు మారాం మామూలుగా లేదంటూ ఈ వీడియోకు కామెంట్లు వస్తున్నాయి. ఏదైనా పెంచిన ప్రేమ వదలడం లేదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఏనుగు తీరు ముచ్చటగా ఉందని కామెంట్ చేస్తున్నారు.