Bullet Bhaskar: జబర్దస్త్ టెన్షన్ ఎక్కువే: నటుడు బుల్లెట్ భాస్కర్!

Bullet Bhaskar Interview

  • పాప్యులర్ కామెడీ షో 'జబర్దస్త్'
  • తనకి స్టార్ డమ్ తెచ్చిందన్న భాస్కర్
  • స్కిట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తానని వ్యాఖ్య 
  • తన ఫేవరేట్ హీరో మహేశ్ బాబు అని వెల్లడి


'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయినవారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరు. చాలా కాలం నుంచి ఆయన 'జబర్దస్త్'లో చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'జబర్దస్త్'కి నన్ను ముందుగా పరిచయం చేసింది రాకెట్ రాఘవ. అంతకుముందు చాలా స్కిట్స్ చేసినప్పటికీ, 2015 నుంచి నాకు స్టార్ డమ్ వచ్చింది" అని అన్నాడు. 

" మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. అందువలన ఆర్టిస్టులను అనుకరిస్తూ ఉండేవాడిని. అంతకుముందు నేను కృష్ణగారి అభిమానిని .. ఇప్పుడు మహేశ్ బాబు ఫ్యాన్ ని. ఆయన వాయిస్ ను అనుకరిస్తూ చేసిన స్కిట్స్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నేను నా స్కిట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. ఒకసారి స్కిట్ కోసం గుండు కూడా చేయించుకున్నాను" అని అన్నాడు. 

" ఎంతో కష్టపడి డిజైన్ చేసుకున్న స్కిట్స్ పేలకపోవడం .. అప్పటికప్పుడు అనుకుని చేసిన స్కిట్స్ అద్భుతాలు చేయడం నేను చూశాను. నా వరకూ నేను నా స్కిట్ బోర్ అనిపించకుండా చూసుకుంటాను. జబర్దస్త్ గురించి తప్ప నేను మరి దేని విషయంలోనూ టెన్షన్ పడను. జబర్దస్త్ ఒక వారం స్కిట్ పూర్తికాగానే రిలాక్స్ అవుతాను .. ఆ వెంటనే నెక్స్ట్ వీక్ ఏ అంశంపై చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటాను" అని చెప్పాడు. 

Bullet Bhaskar
Actor
Jabardasth
  • Loading...

More Telugu News