Manchu family: నిజానిజాలు తెలుసుకోండి.. తప్పుడు ప్రచారం చేయొద్దు: మోహన్ బాబు

Mohan Babu Tweet On His Bail Petition Rejection News

--


జర్నలిస్టులపై దాడి కేసులో జరుగుతున్న పరిణామాలను వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంచు మోహన్ బాబు ఆరోపించారు. ఈ విషయంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయని చెబుతూ.. అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేశారు. కోర్టు తన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని మోహన్ బాబు తెలిపారు. నిజానిజాలు తెలుసుకుని, వాస్తవాలను మాత్రమే ప్రజలకు వెల్లడించాలని మీడియాకు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News