Hero Darshan: అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌కు భారీ ఊరట

big relief to darshan in renukaswamy murder case

  • రేణుకాస్వామి కిడ్నాప్, దారుణ హత్య కేసు
  • హీరో దర్శన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
  • హీరో దర్శన్‌తో పాటు నటి పవిత్ర గౌడ సహా ఆరుగురికి బెయిల్ మంజూరు

రేణుకాస్వామి అనే అభిమాని దారుణ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దర్శన్‌తో పాటు నటి పవిత్ర గౌడ సహా ఆరుగురికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, అతడి స్నేహితురాలు నటి పవిత్ర గౌడతో పాటు 16 మందిని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు ఆదేశాలతో వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. 

అయితే, వెన్నెముక సర్జరీ నిమిత్తం దర్శన్ ఇంతకు ముందు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆరు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో దర్శన్ జైలు నుంచి బయటకు వచ్చారు. తాజాగా రెగ్యలర్ బెయిల్ మంజూరు అయింది. 
 
అసలు ఏమి జరిగిందంటే.. ఈ ఏడాది జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమనహల్లి రోడ్ సైడ్ డంప్ నందు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తుకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను నియమించగా, బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం విచారణ జరిపింది. 

తన స్నేహితురాలు పవిత్రగౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపి వేధిస్తున్నాడని రేణుకాస్వామిని జూన్ 8న బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకువెళ్లి దర్శన్ బృందం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏ 1గా హీరోయిన్ పవిత్రగౌడ, ఏ 2గా హీరో దర్శన్ పేర్లను పేర్కొంటూ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. రేణుకాస్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మందిని విచారించినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.  

  • Loading...

More Telugu News