ap government: ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసిన ఏపీ సర్కారు

ap government forms single member commission for sc sub classification

  • ఎస్సీ ఉప వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమించిన ఏపీ సర్కార్ 
  • విశ్రాంత ఐపీఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్
  • ఈ నెల 16 నుంచి 19 వరకు జిల్లాల్లో ఏకసభ్య కమిషన్ విచారణ

సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలలోని ఉప వర్గీకరణపై విచారణ చేసేందుకు గానూ ఏపీ సర్కార్ .. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో కమిషన్ పర్యటిస్తుంది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఉప కులాల వర్గీకరణ అంశంపై వ్యక్తులు లేదా సంస్థల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరిస్తుందని పేర్కొంది. నేరుగా వినతులు సమర్పించలేని వారు విజయవాడ మొగల్రాజపురంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా ఈ మెయిల్ (omcscsubclassification@gmail.com) ద్వారా జనవరి 9వ తేదీలోగా పంపాలని సూచించింది.  

  • Loading...

More Telugu News