Revanth Reddy: రేపు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించనున్న తెలంగాణ సీఎం

CM Revanth Reddy to inspects hostels

  • హాస్టళ్లలోనే విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్న సీఎం, అధికారులు
  • సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్ తదితరులు
  • రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో పరిస్థితిని సమీక్షించనున్న అధికారులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పలు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు... గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను రేపు వ్యక్తిగతంగా సందర్శించి తనిఖీ చేయనున్నారు. హాస్టళ్లలోనే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు.

హాస్టళ్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్‌‍ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించడంతో పాటు మెరుగైన విద్యాబోధన అవకాశాలను పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రేపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పర్యటించి పరిస్థితిని స్వయంగా సమీక్షించనుంది.

  • Loading...

More Telugu News