Allu Arjun: ఇంకా చంచల్ గూడ జైలు రిసెప్షన్ లోనే ఉన్న అల్లు అర్జున్

Allu Arjun will release from jail in a short while

  • సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
  • 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • హైకోర్టులో బన్నీకి ఊరట
  • నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరగ్గా... ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నేడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. 

గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా... 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో ఆయనను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. హైకోర్టు నాలుగు వారాల పాటు అమల్లో ఉండేలా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

కాసేపట్లో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి వెలుపలికి రానున్నారు. ప్రస్తుతం ఆయన ఇంకా చంచల్ గూడ జైలు రిసెప్షన్ కౌంటర్ వద్దే ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యేందుకు ఓ గంట సమయం పడుతుందని భావిస్తున్నారు. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించిన తర్వాత, ఆ పత్రాలను చంచల్ గూడ జైలు అధికారులకు అందించాల్సి ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ విడుదల కానున్నారు. 

ఇదిలా ఉంటే... అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, పుష్ప-2 నిర్మాతలు కూడా జైలుకు వద్దకు చేరుకున్నారు.

More Telugu News