Red Fort: ఎర్రకోటను అప్పగించాలని మొఘల్ వారసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

Delhi HC rejects plea by descendant of Bahadur Shah Zafar II seeking possession of Red Fort

  • తమ పూర్వీకులు నిర్మించిన ఎర్రకోటను అప్పగించాలని పిటిషన్
  • పిటిషన్ దాఖలు చేసిన బహదూర్ షా జాఫర్ 2 మునిమనుమడి భార్య
  • ఎర్రకోటను తమకు అప్పగించాలని లేదా పరిహారం ఇప్పించాలని కోరిన వారసులు

ఎర్రకోటను తమకు అప్పగించాలని కోరుతూ మొఘల్ వారసులు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రకోటను తమ పూర్వీకులు నిర్మించారని, దానిని ప్రభుత్వం తమకు ఇచ్చేయాలంటూ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-2 మునిమనుమడి భార్య సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టులో 2021లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దానిని కొట్టివేసింది.

గతంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తమ పూర్వీకుల నుంచి అక్రమంగా తీసుకున్న ఎర్రకోటను తమకు అప్పగించాలని అందులో పేర్కొన్నారు. మొదటి స్వాతంత్ర్య యుద్ధం అనంతరం మొఘలుల ఆస్తులు, ఎర్రకోట వంటి కట్టడాలను బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారని, దీంతో దేశం విడిచి వెళ్లిపోయిన నాటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-2 1862లో మృతి చెందినట్లు పిటిషన్‌లో తెలిపారు.

వారు నిర్మించిన ఎర్రకోటను ప్రభుత్వం ఆక్రమించుకుందని పేర్కొన్నారు. తమ ఆస్తిని తిరిగి ఇప్పించాలని కోరారు. ఆస్తిని తమకు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకుంటే అందుకు పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం... ఆమె అప్పీల్‌ను తోసిపుచ్చింది.

More Telugu News