Allu Arjun: నమ్మలేకపోతున్నా: అల్లు అర్జున్ అరెస్ట్ పై రష్మిక పోస్ట్

Rashmika reacts on Allu Arjun arrest

  • ఈ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు
  • అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు
  • 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు
  • ఈ ఘటనకు ఒక్కరినే బాధ్యుల్ని చేయడం బాధాకరమన్న రష్మిక

సంధ్య థియేటర్ ఘటన కేసులో ఈ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం, తెలంగాణ హైకోర్టులో రెండు గంటల పాటు సుదీర్ఘ విచారణ జరగడం, ఆపై అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం... తెలిసిందే. 

కాగా, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై పుష్ప-2 హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇప్పుడు నేను చూస్తున్నది నిజమేనా... నమ్మలేకపోతున్నా అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని, అత్యంత విషాదభరితమైనదని పేర్కొన్నారు. కానీ దీనంతటికీ ఒక్కరినే దీనికి బాధ్యులుగా చేయడం కలచివేస్తోందని రష్మిక ట్వీట్ చేశారు.

Allu Arjun
Arrest
Rashmika
Sandhya Theater Incident
Hyderabad
Pushpa-2
  • Loading...

More Telugu News