Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ వేళ... వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Varun Dhawan defends Allu Arjun

  • థియేటర్‌లో జరిగిన ఘటన బాధాకరమన్న వరుణ్ ధావన్
  • కానీ ఇందుకు ఒకే వ్యక్తిని నిందించడం సరికాదని వ్యాఖ్య
  • అన్ని అంశాలు నటీనటులు ఒక్కరే చూసుకోలేరన్న వరుణ్ ధావన్

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ వేళ... బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జరిగిందో అది బాధాకరమని (సంధ్య థియేటర్‌లో మహిళ మృతి), కానీ ఇందుకు ఒక వ్యక్తినే నిందించడం దురదృష్టకరమన్నారు. 'బేబీ జాన్' ప్రమోషన్స్‌లో భాగంగా జైపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో వరుణ్ ధావన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... భద్రతాపరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరన్నారు. జాగ్రత్తగా ఉండమని సూచించడం మాత్రమే నటీనటులు చేయగలరన్నారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు.

  • Loading...

More Telugu News