KTR: అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ స్పందన

KRS Condemns Allu Arjun arrest

  • అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన కేటీఆర్
  • తొక్కిసలాటతో బన్నీకి సంబంధం లేదని వ్యాఖ్య
  • బన్నీని సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదన్న కేటీఆర్

హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందని... కానీ ఆ ఘటనలో వాస్తవంగా విఫలమయింది ఎవరని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు నేరుగా ఎలాంటి సంబంధం లేని కేసులో... ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదని స్పష్టం చేశారు.

గౌరవం, గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎప్పుడూ స్థానం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇదే లాజిక్ తో వెళితే... హైడ్రా సృష్టించిన భయాందోళనల కారణంగా హైదరాబాద్ లో ఇద్దరు అమాయకులు చనిపోయారని... దీనికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. 

KTR
BRS
Allu Arjun
Tollywood
Arrest
  • Loading...

More Telugu News