Pushpa 2: మరో సెన్సేషనల్ రికార్డు సాధించిన పుష్ప-2

Pushpa 2 becomes Highest Grossing Indian Movie Of 2024

  • 2024లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా అవతరణ
  • విడుదలైన 8 రోజుల్లోనే రూ.1,067 కోట్లు వసూలు
  • ప్రభాస్ ‘కల్కి 2898’ని అధిగమించిన పుష్ప-2

అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తూ గురువారంతో మరో రికార్డును సొంతం చేసుకుంది. 2024లో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

పుష్ప-2 ఎనిదవ రోజు ముగింపు సమయానికి భారతదేశంలో రూ.726.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,067 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించిందని బాక్సాఫీస్ కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ రిపోర్ట్ పేర్కొంది.

పుష్ప-2 తదుపరి మరిన్ని బ్లాక్‌బస్టర్‌ సినిమాల కలెక్షన్ల దిశగా దూసుకెళుతోంది. ఈ జాబితాలో కేజీఎఫ్: చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు), జవాన్ (రూ. 1,160 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (రూ. 1,230 కోట్లు), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (రూ. 1,788.06 కోట్లు) వంటి సినిమాలు ఉన్నాయి.

పుష్ప-2 వసూళ్లు ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ థియేటర్లలో ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతోందని ‘శాక్‌నిల్క్’ కథనం పేర్కొంది. తెలుగు మార్కెట్‌లో సినిమా ఆక్యుపెన్సీ రేటు 24.63 శాతంగా ఉందని తెలిపింది. మార్నింగ్ షోలకు 14.41 శాతం, మధ్యాహ్నం 23.85 శాతం, సాయంత్రం 30.56 శాతం, నైట్ షోలకు 29.68 శాతంగా ఆక్యుపెన్సీ ఉందని పేర్కొంది. హిందీ వెర్షన్ ఆక్యుపెన్సీ 28.93 శాతంగా ఉందని వెల్లడించింది.

కాగా, విడుదలైన ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. అత్యంత వేగంగా ఈ రికార్డును అందుకున్న భారతీయ సినిమాగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News