Fronx: మారుతి సుజుకీకి కలిసొచ్చిన 'ఫ్రాంక్స్'

Maruti Suzuki Fronx records huge sales this year also

  • కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో తిరుగులేని ఫ్రాంక్స్
  • గతేడాది ఏప్రిల్ లో మార్కెట్లోకి ఎంట్రీ
  • జనవరి నుంచి నవంబరు మధ్య కాలంలో 1.45 లక్షల యూనిట్ల విక్రయాలు
  • హ్యుండాయ్ వెన్యూ, కియా సోనెట్ లను వెనక్కి నెట్టిన ఫ్రాంక్స్

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా సంస్థ అనేక మోడల్స్ తో ప్రపంచవ్యాప్తంగా తన విపణిని విస్తరించుకుంది. మారుతి సుజుకి ఉత్పాదనల్లో ఫ్రాంక్స్ కూడా ఒకటి. ఇది కాంపాక్ట్ ఎస్ యూవీ. ఈ కారును 2023 ఏప్రిల్ లో లాంచ్ చేశారు. 

చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించే ఫ్రాంక్స్... మారుతి సుజుకీ సంస్థకు అమ్మకాల పరంగా బాగా కలిసొచ్చిందని చెప్పాలి. 2023 ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్య కాలంలో 94,393 ఫ్రాంక్స్ కార్లు అమ్ముడయ్యాయి. ఇక ఈ ఏడాది కూడా ఈ కారుకు ఎదురులేకుండా పోయింది. 2024 జనవరి నుంచి నవంబరు వరకు 1,45,484 ఫ్రాంక్స్ కార్లు అమ్ముడయ్యాయి.

కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారుకు హ్యుండాయ్ వెన్యూ, కియా సోనెట్ గట్టి పోటీదారులుగా ఉన్నాయి. అయితే, ఈ రెండు మోడళ్లను అమ్మకాల పరంగా ఫ్రాంక్స్ వెనక్కి నెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు హ్యుండాయ్ వెన్యూ 1,07,554 యూనిట్లు, కియా సోనెట్ 1,03,353 యూనిట్లు అమ్ముడయ్యాయి. 

భారత్ లో అమ్మకాల పరంగా టాప్-10 ఎస్ యూవీల్లో మారుతి సుజుకీ కంపెనీకి చెందినవే మూడు మోడల్స్ ఉన్నాయి. అవి... ఫ్రాంక్స్, బ్రెజా, గ్రాండ్ విటారా. 

అన్నింట్లోకి... వినియోగదారులు ఫ్రాంక్స్ వైపు మొగ్గుచూపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో పలు రకాల పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ ఉండడం, ముఖ్యంగా మైలేజీ బాగుండడం, సేఫ్టీ పరంగా పటిష్టమైన ఏర్పాట్లు ఉండడం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండడం ఫ్రాంక్స్ ను మిగత కార్ల కంటే ఓ మెట్టు పైన నిలుపుతున్నాయి.

  • Loading...

More Telugu News