Telangana: జనగాం సహా నాలుగు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Telangana HC notices to four district collectors

  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడంపై నోటీసులు
  • జనగాం, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు
  • కోర్టు ధిక్కరణ ఎందుకు కాదో చెప్పాలంటూ నోటీసులు

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విషయమై జనగాం సహా నాలుగు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

రైతు ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గత ఏడాది హైకోర్టులో విచారణ జరిగింది. పరిహారం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని, నాలుగు నెలల్లో చెల్లిస్తామని అప్పుడు ప్రభుత్వం... కోర్టుకు తెలిపింది. అయితే ఏడాది దాటినప్పటికీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించలేదంటూ కొండల్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నాలుగు జిల్లాల కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్‌ను కోర్టు దిక్కరణ కింద ఎందుకు స్వీకరించకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News