Rashmika Mandanna: నేను అనారోగ్యానికి గురైతే ఆయన ఎంతో కేర్ తీసుకున్నారు: రష్మిక మందన్న

Rashmika heaps praise on Salman Khan

  • ఆలిండియా లెవల్లో దూసుకెళుతున్న రష్మిక
  • తాజాగా పుష్ప-2తో తిరుగులేని విజయం
  • సల్మాన్ ఖాన్ తో సికిందర్ చిత్రంలో నటిస్తున్న అమ్మడు
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు సికిందర్
  • సల్మాన్ ఖాన్ పై ప్రశంసలు కురిపించిన సౌత్ బ్యూటీ

దేశంలోని ప్రధాన చిత్ర పరిశ్రమలన్నింటిలో తనదైన ముద్ర వేస్తూ దూసుకెళుతున్న యువ హీరోయిన్... రష్మిక మందన్న. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సక్సెస్ గ్రాఫ్ పెంచుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప-2 గ్రాండ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. 

కాగా, రష్మిక నటించిన రెండు బాలీవుడ్ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒకటి ఛావా.... రష్మిక ఇందులో వికీ కౌశల్ సరసన నటించింది. అమ్మడు నటిస్తున్న మరో భారీ చిత్రం సికిందర్... ఇందులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరో. 

తాజాగా ఓ కార్యక్రమంలో రష్మిక... సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో వినయంగా ఉంటారు. సికిందర్ షూటింగ్ సమయంలో నేను అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడు నేను సెట్స్ మీదే ఉన్నాను. 

నాకు ఒంట్లో బాగా లేదన్న విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్... అప్పటికప్పుడు ప్రొడక్షన్ వాళ్లకు చెప్పి ఆరోగ్యకరమైన ఆహారం, వేడి నీళ్లు తెప్పించారు. ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు. ఆ సమయంలో నా పట్ల ఎంతో కేర్ తీసుకున్నారు. ఎవరినైనా సరే ఆయన తన సొంత మనిషిలా భావిస్తారు... అదే సల్మాన్ ఖాన్ ప్రత్యేకత. దేశంలోనే అతి పెద్ద స్టార్ హీరోల్లో ఆయన ఒకరు. కానీ, ఎంతో ఒద్దికగా ఉంటారు" అని వివరించారు.

  • Loading...

More Telugu News