Gukesh: పిన్నవయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించిన గుకేశ్

Gukesh becomes youngest world Chess champion

  • చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించి ఘనత సాధించిన గుకేశ్
  • 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారతీయుడు
  • ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నానన్న గుకేశ్

భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. చివరిదైన 14వ గేమ్‌లో చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నాడు. అత్యంత చిన్న వయసులో 18 ఏళ్లకే గుకేశ్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. మొత్తం 14 గేమ్‌లలో గుకేశ్ 3, లిరెన్ 2 గేమ్‌లలో విజయం సాధించారు. తొమ్మిది గేమ్‌లు డ్రా అయ్యాయి. 

ఈ క్షణం కోసం పదేళ్లుగా చూస్తున్నా

ఈ క్షణం కోసం తాను పదేళ్లుగా కలలు కన్నానని గుకేశ్ అన్నాడు. తన కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ విజయాన్ని తాను ఊహించలేదని, ఈ ఘనత సాధించగానే భావోద్వేగానికి లోనయ్యానన్నాడు. తన దృష్టిలో లిరెన్ నిజమైన ప్రపంచ ఛాంపియన్ అని పేర్కొన్నాడు. లిరెన్‌కు అతను ధన్యవాదాలు తెలిపాడు.

Gukesh
Chess
India
China
  • Loading...

More Telugu News