G. Kishan Reddy: ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
- ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి
- కిషన్ రెడ్డిని కలిసినప్పుడు సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు
- వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్న ముఖ్యమంత్రి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం కిషన్ రెడ్డిని కలిశారు.
కిషన్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పారు. రేవంత్ రెడ్డికి కూడా కిషన్ రెడ్డి శాలువా కప్పారు. అనంతరం ఇరువురు కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆ తర్వాత కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు.