Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 236 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 93 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.76 శాతం నష్టపోయిన ఎన్టీపీసీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 81,289కి పడిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 24,548 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.67%), భారతి ఎయిర్ టెల్ (1.56%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.31%), ఇన్ఫోసిస్ (0.92%), అదానీ పోర్ట్స్ (0.90%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.76%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.42%), టాటా మోటార్స్ (-1.59%), మారుతి (-1.42%), ఎల్ అండ్ టీ (-1.26%).