Keerthy Suresh: వేడుకగా కీర్తి సురేశ్ వివాహం... పెళ్లి ఫొటోలు ఇవిగో!

Keerthy Suresh marriage pics

  • ప్రియుడు ఆంటోనీని పెళ్లాడిన కీర్తి సురేశ్
  • గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వివాహ వేడుక
  • శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ ప్రముఖులు

సినీ నటి కీర్తి సురేశ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీని పెళ్లాడింది. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

15 ఏళ్లుగా కీర్తి సురేశ్, ఆంటోనీ స్నేహితులు.  వీరి స్నేహం ప్రేమగా మారింది. దీపావళి సందర్భంగా తమ ప్రేమ గురించి కీర్తి వెల్లడించింది. ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోనే షేర్ చేసింది. తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని ఆమె తెలిపింది. 

ఆంటోనీ విషయానికి వస్తే... ఆయనది వ్యాపార కుటుంబం. చెన్నై, కొచ్చిలో వారికి వ్యాపారాలు ఉన్నాయి. స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆయనకు స్నేహం ఉంది. కాలేజ్ రోజుల్లో వారి స్నేహం ప్రేమగా మారింది. 

Keerthy Suresh
Tollywood
Bollywood
marriage
  • Loading...

More Telugu News