Manchu Manoj: గొడవలు పక్కన పెట్టి... షూటింగ్ కు వెళ్లిపోయిన మంచు మనోజ్

Manchu Manoj went to shooting

  • వివాదాలతో మూడు రోజులుగా వార్తల్లో మంచు ఫ్యామిలీ
  • 'భైరవం' షూటింగ్ కు వెళ్లిపోయిన మనోజ్
  • ఈ చిత్రంలో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్

కుటుంబ గొడవలతో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం గత మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తనకు, తన కుటుంబానికి హాని ఉందంటూ ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... మనోజ్ పై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. ఒక ఛానల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యయత్నం కింద కేసు కూడా నమోదయింది. పోలీసుల సూచనలతో తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను నిన్న సాయంత్రమే మంచు మనోజ్ వెనక్కి పంపించేశాడు. 

ఈ పరిణామాల నేపథ్యంలో... మంచు మనోజ్ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తన తాజా చిత్రం 'భైరవం' షూటింగ్ కు వెళ్లిపోయాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Manchu Manoj
Tollywood
  • Loading...

More Telugu News