Manchu Lakshmi: కుటుంబ గొడవల సమయంలో... వైరల్ అవుతున్న మంచు లక్ష్మి పోస్ట్

Manchu Lakshmi post going viral

  • సంచలనం రేపుతున్న మంచువారి కుటుంబ గొడవ
  • మార్కస్ ఆరెలియస్ సందేశాన్ని పోస్ట్ చేసిన మంచు లక్షి
  • ఈ ఏడాది తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని వ్యాఖ్య

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు. మంచువారి కుటుంబ గొడవ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఈ తరుణంలో మంచు లక్ష్మి ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. 'ప్రపంచంలోని ఏదీ మీకు చెందనప్పుడు... మీరు ఏదో కోల్పోతారని భయమెందుకు?' అంటూ మార్కస్ ఆరెలియస్ అనే రచయిత రాసిన సందేశాన్ని ఆమె షేర్ చేశారు. తమ కుటుంబంలోని గొడవల నేపథ్యంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. 2024లో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని మరో పోస్ట్ లో తెలిపారు.

More Telugu News