Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు కోసం నేడు లాటరీ

allotment of returnable plots to capital farmers

  • ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో రిటర్నబుల్ ప్లాట్ల కోసం నేడు లాటరీ ప్రక్రియ
  • 14 గ్రామాల రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణ పథకంలో భూములను అప్పగించిన రైతులకు ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్లకు నేడు (గురువారం) ఈ - లాటరీ జరుగుతుంది. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో దీనిని నిర్వహిస్తారు.   

అమరావతి పరిధిలో 14 గ్రామాలలోని రైతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారు. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 

నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు తదితర గ్రామాలలో సంబంధిత రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.  

More Telugu News